ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

జగన్ కు గుడి కట్టడానికి కారణమిదేనా?


రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టడుతున్న అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజుపాలెం గ్రామంలో నిర్మిస్తున్న ఈ గుడికి స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంఖుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వైసీపీ నాయకులకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే సందేహం అందరికీ తలెత్తుతుంది. ఈ వ్యవహారం వెనుక చాలా కథ ఉన్నట్లు అక్కడి వైసీపీ నాయకులు కొందరు చెబుతున్నారు.

Also Read: ఉప ఎన్నికలపై పవన్ భవితవ్యం ఆధారపడి ఉందా?

ఎంతో కాలంగా వైసీపీలో నాయకుడిగా ఉన్న తలారి వెంకట్రావు 2014 ఎన్నికల్లో ఓటమి పాలవగా, 2019 విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. రెండేళ్లకు మంత్రుల్లో సగం మందిని మారుస్తానని సిఎం కేబినెట్ ఏర్పాటు సమయంలోనే చెప్పారు. ఈ క్రమంలో భవిష్యత్తులో దళిత సామాజిక వర్గం నుంచి తలారి వెంకట్రావు పేరు పరిశీలనలో ఉందని ఆయనకు సమాచారం అందిందంట. దీంతో అప్పటి నుంచి తలారి జగన్ మెప్పు పొందేందుకు కొత్తగా ఏం చేయాలా అని ఆలోచన చేస్తూ చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతటితో తలారి వెంకట్రావు ఆగలేదండోయ్… తనకు పరిచయం ఉన్న మంత్రుల వెంట పర్యటనలు చేస్తూ మంత్రులుగా వాళ్లు ఏం చేస్తున్నారు. ఎలా పని చేస్తున్నారు. ఏం చేయాలి అనే విషయాలతోపాటు మంత్రి వర్గ సమావేశాలు జరిగినప్పుడల్లా సచివాలయానికి వస్తున్నాడని స్థానికి వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇంత చేస్తున్నా ఆ జిల్లాలోని దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి తానేటి వనితతో మాత్రం తలారి వెంకట్రావుకు సత్సంబందాలు లేవంట.

Also Read: ముందు చంద్రబాబు స్థానం, ఆ తరువాత సీఎం పీఠం..!

ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీయవద్దని అదే జిల్లాకు చెందిన నర్సాపురం ఎంపీ రాఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు హితవు పలికారు. అయోధ్యలో రామాలయానికి భూమిపూజ చేసిన సమయంలో సిఎం జగన్ గుడి నిర్మాణానికి శంఖుస్థాపన చేయడాన్ని ఆయన తప్పబట్టారు. మీకు అభిమానం ఉంటే జగన్ కోసం చర్చి నిర్మించుకోవాలని సూచన ఇచ్చారు. గుడి అనేది హిందువులకు ఎంతో సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ తో ఆటలాడుకోవద్దని సూచించారు. గుడి నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన తలారి వెంకట్రావు దానిని చర్చిగా మారుస్తాడా… గుడి నిర్మాణాన్నే పూర్తి చేస్తారో భవిష్యత్తే తెల్చాలి.

Tags
Back to top button
Close
Close