విశాఖ ఉత్తరంలో వైసీపీ కొత్త ఎత్తులు..!
రాజకీయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒకలాగా.. అధికారంలోకి వచ్చాక మరోకలాగా.. మారడం సహజమే. ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పడు ప్రభుత్వం చేసే ప్రతీ పని తప్పులాగే కనిపిస్తుంది. కానీ అధికారంలోకి మారాగా అలాంటి పనులనే అనుసరించాల్సి వస్తుంది. ఇదే సీన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు జగన్ కూడా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు వ్యతిరేకించిన జగనే ఇప్పడు సమర్థించడంపై టీడీపీ నాయకులు కన్నెర్ర చేస్తున్నారు.
Also Read: చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖపై విచారణ బెంచ్ మార్పు.. తీర్పుపై ఉత్కంఠ
చంద్రబాబు అధికారంలో ఉండగా ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను వెనుకేసుకొచ్చేవారు. కొందరు ఓడిపోయినా మళ్లీ వారికే ఆ నియోజకవర్గంలో ఇన్ చార్జి పదువులు కట్టబెట్టి గెలిచిన అపోజిట్ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసేవారు. ఇలాంటి నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ఇన్ చార్జిల చేత అభివ్రుద్ధి పనులు చేయిస్తూ ఎమ్మెల్యేలను డమ్మీ చేయించేవారు. అయితే అప్పడు గెలిచిన ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు, ఓడిపోయిన వారు అభివ్రుద్ధి పనులు చేయించడమేంటని విమర్శించారు.
కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. అందుకు ఉదాహరణగా విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ టీడీపీకి చెందిన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. అయితే గంటా శ్రీనివాసరావు పార్టీనే కాకుండా నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదు. గత కొంత కాలంగా వైసీపీలో చేరుతాడన్న ఆరోపణలకు ఆయన ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఇక్కడ జగన్ వైసీపీ ఇన్ చార్జి కేకే రాజుకు ఫుల్ పవర్స్ ఇచ్చేశాడు.
Also Read: తిరుపతి సీటుపై జగన్ స్పెషల్ ఫోకస్
ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి అభివ్రుద్ధి నిధులను మంజూరు చేస్తున్నాడు. కేకే రాజు సైతం తమ నియోజకవర్గానికి కావాల్సిన నిధులను లెక్కలేసుకొని జగన్ వద్ద ఉంచాడట. సీఎం సైతం ఏమాత్రం అడ్డు చెప్పకుండా నిధులు వెంటనే విధులు చేస్తున్నాడట. దీంతో కేకే రాజు స్థానిక అధికారులను పిలిచి పనులు చేయిస్తున్నాడట. అయితే ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు మాత్రం నోరు మెదపడం లేదట. తనను పట్టించుకోవడం లేదన్న విషయాన్ని కూడా చెప్పడం లేదట.
కాగా మరికొన్నిచోట్ల ఇలాంటి సమస్యలు ఎదురవడంతో టీడీపీ నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. వైసీపీ నాయకులు ప్రొటోకాల్ పాటించకుండా అభివ్రుద్ధి పనులు చేయించడమేంటని విమర్శిస్తున్నారు. కానీ ఇలా వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జులు అభివ్రుద్ధి పనులు చేయించి వచ్చే ఎన్నికల్లోనైనా తమ సీటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారట. మరి ఈ విషయంపై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తాడో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్