ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

వైసీపీ అధిష్టానం వారిని పక్కనపెట్టినట్లేనా..?

YCP supremacy has put them aside ..?

ఆర్కే రోజా, అంబటి రాంబాబు.. ఇద్దరూ వైసీపీలో ఫైర్‌‌బాండ్లు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్‌కు అండగా నిలిచిన నేతలు. అపొజిషన్‌ వారి మాటలకు దీటైన జవాబు ఇచ్చిన వాగ్ధాటి గలవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ప్రతిపక్ష పార్టీకి టార్గెట్‌ అయిపోయారు. దాదాపు ఐదేళ్ల పాటు వైసీపీ వాయిస్‌ను బలంగా వినిపించిన నేతలు అధికారంలోకి రాగానే సొంత పార్టీ నుంచే అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు అధిష్టానం కూడా ఈ ఫైర్ బ్రాండ్లను పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.

Also Read: కులాలకు చెల్లు.. జగన్ మరో సంచలన నిర్ణయం

జగన్‌ వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించాక.. ఆ పార్టీ ఐదేళ్లపాటు ప్రతిపక్షంలోనే ఉంది. వైసీపీలో చేరిన ఆర్కే రోజా, అంబటి రాంబాబు ఆది నుంచీ టీడీపీని ఓ ఆట ఆడుకుంటూనే ఉన్నారు. అదే పనిగా పెట్టుకున్నారు కూడా. అందుకే వారు ఫైర్‌‌ బ్రాండ్లుగా ముద్రపడ్డారు. జగన్ అధికారంలోకి రాగానే వీరికి ఖచ్చితంగా పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ.. వైసీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

ఆర్కే రోజాకు మంత్రి పదవి దక్కకపోయినా ఏపీఐఐసీ చైర్మన్‌ పదవి ఇచ్చార్‌‌ సీఎం జగన్‌. కేబినెట్‌ హోదాలో ఉండి ఆ స్థాయిలో మెయింటెన్‌ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. సొంత నియోజకవర్గంలోనే ఆమెకు పార్టీ నేతలు గోతులు తవ్వడం ప్రారంభించారు. దీంతో ఆమె కొంత డిస్టర్బ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. నగరిలో తనను ఒంటరి చేయాలని పార్టీలోని ఓ వర్గం ప్రయత్నిస్తోందని రోజా వర్గం ఆరోపిస్తూనే ఉంది. అధిష్టానం కూడా ఆ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా అంటున్నారు.

Also Read: ఒక్క వర్షం.. పదుల సంఖ్యలో ప్రాణాలు..

మరో ఫైర్‌‌బ్రాండ్‌ అంబరి రాంబాబు పరిస్థితికూడా అలాగే ఉంది. ఆయనకు ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు. పైగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయనను వ్యతిరేకించే వర్గం తయారైంది. పైగా అంబటిరాంబాబుకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. వీరిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఇలా విపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో ఓ స్థాయిలో వెలుగొందిన వీరు.. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాగానే ఇబ్బందులు ఎదుర్కంటున్నట్లు తెలుస్తోంది.

Back to top button