గుసగుసలుప్రత్యేకంసినిమా వార్తలు

ఆ హీరోయిన్ ప్రేమను పంచుకున్న ఆ ఇద్దరు !

women2
women2

కాల ప్రవాహంలో మనుషుల అభిరుచులు మారతాయి. అయితే, అభిరుచుల కోసం మనుషులు తమను మార్చుకుంటేనే ప్రమాదం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి ప్రమాదాలే ఎక్కువుగా జరుగుతున్నాయి. ఇదేం కర్మ ఏమో గానీ, ప్రపంచంలోని సహజీవన సంస్కృతి అంతా ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చి చేరుతుంది.

ఏ కొత్త డైరెకర్ని తీసుకున్నా.. ఏ కొత్త హీరోయిన్ని తీసుకున్నా సింపుల్ గా లివింగ్ టుగెదర్ రిలేషన్ అని ఓ మాట అనేసుకుని తమకు నచ్చినట్టు మొహమాటం లేకుండా ముందుకు వెళ్లిపోతున్నారు. ఒక్క టాలీవుడ్ లోనే ఇలాంటి వ్యవహారాలు బయటకు తెలిసినవి, తెలియని చాలా వున్నాయి. వాటిల్లో ఒక వ్యవహారం మరీ విచిత్రంగా ఉంది.

ఓ డైరక్టర్ తో ఓ యంగ్ హీరోయిన్ గత కొన్ని నెలలుగా లివింగ్ టుగెదర్ లో ఉంది. ప్రేమించుకుంటున్నారేమో అనుకోవచ్చు. అయితే, ఆ డైరెకర్ కి ఆల్ రెడీ పెళ్లి అయిపోయింది. సరే.. సెకండ్ లవ్ అని సరిపెట్టుకోవచ్చు. కట్ చేస్తే ఆ యంగ్ హీరోయిన్ ఈ మధ్య మరో కుర్ర హీరోతో తిరుగుతుంది. మరి ఆ హీరోయిన్ వైనం ఎప్పుడూ ఇలాగే ఉంటుందో.. లేక ఆ డైరెక్టర్ తో చేరాక ఇలా మారిందో తెలియడం లేదు.

ప్రస్తుతానికి అయితే ఆ దర్శకుడితో ఇంకా లివింగ్ టుగెదర్ రిలేషన్ లోనే ఉంది. అలాగే ఆ కుర్ర హీరోతో కూడా. ఇంతకీ ఆ డైరక్టర్ ఇప్పటికే ఓ సినిమా చేసాడు. చాలా అడ్డంకులను దాటుకుని ఆ సినిమా విడుదలై, మొత్తానికి బాగానే ఆడింది. ఆ సినిమాలోనే నటించిందీ ఈ యంగ్ హీరోయిన్. ఈమె నార్త్ ఇండియన్ అమ్మడు. అందుకే ఇంత బోల్డ్ గా ముందుకుపోతుంది.

మరి ఈ బోల్డ్ బ్యూటీ ఆ కుర్ర హీరోని, ఆ డైరెక్టర్ని ఒకేసారి ఎలా మ్యానేజ్ చేస్తోందో. ఇక ఆ డైరెక్టర్ ఇప్పటికే మరో సినిమాని స్టార్ట్ చేశాడు. కానీ హీరోయిన్ గా తన ప్రియురాలను మాత్రం పెట్టుకోలేదు. అందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అయినా ఈ యంగ్ హీరోయిన్ కి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఇక ఆ కుర్రహీరో కూడా ఒక సినిమా చేసున్నాడు. అతను కూడా ఈ హీరోయిన్ కి ఛాన్స్ ఇవ్వలేదు. రిలేషన్ లో ఉండి కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం విచిత్రమే.

Back to top button