టాలీవుడ్వైరల్సినిమా

నాట్లు వేసిన హీరోయిన్.. వీడియో వైరల్


దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ 3.0లో కేంద్రం కొన్ని సడలింపులిచ్చినా సినిమా షూటింగ్, థియేటర్లకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సెలబ్రెటీలంతా ఫ్యామిలీతో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో వారి అనుభవాలను పంచుకుంటున్నారు. ఒక్కోక్కరు ఒక్కోలా వారి టాలెంట్ ను బయటికి తీస్తున్నారు. ఫిట్నెస్, యోగా, కుకింగ్, స్కీప్ట్ రైటింగ్, పిల్లో ఛాలెంజ్, మేకప్ ఛాలెంజ్, ది రియల్ మేన్ ఛాలెంజ్ అంటూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే ఓ మలయాళ భామ చేసిన పనికి మాత్రం నెటిజన్లతోపాటు ప్రతీఒక్కరు ఫిదా అవుతున్నారు.

గ్యాస్ లీక్ వెనుక విజయసాయి రెడ్డి!

https://twitter.com/ikeerthipandian/status/1257592144149098497

దేశానికి అన్నం పెట్టే రైతే నిజమైన రియల్ హీరో. అలాంటి రైతు చేసే పనిని ఓ యంగ్ హీరోయిన్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకుంది. ఆమె ఎవరో కాదు.. మలయాళ హీరో కమ్ విలన్ అరుణ్ పాండియన్ కుమార్తె కీర్తి పాండియన్. అరుణ్ పాండియన్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు. లాక్డౌన్ సమయంలో కీర్తి పాండియన్ వ్యవసాయ పనులు చేశారు. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నడంతోపాటు కూలీలతోపాటు నాట్లు వేశారు. వ్యవసాయంలో తనది అందే దేసిన చేయి అన్నట్లుగా చకచక నాట్లు వేయడం అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పిక్స్, వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి.

అష్ట దిగ్బంధంలో 3 జిల్లాలు! ఎందుకంటే..

కాగా కీర్తి పాండియన్ ‘తుంబ’ మూవీతో హీరోయిన్ గా పరిచమైంది. మలయాళంలో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా తన తండ్రితో కలిసి ‘విలన్’ రీమేక్ మూవీలో నటిస్తుంది. ఇక అరుణ్ పాండియన్ కూడా సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఖాళీ సమయాల్లో అరుణ్ పాండియన్కి రైతుగా వ్యవసాయ పనులు చేయడం అలవాటు. ఇక తండ్రి బాటలోనే కీర్తి పాండియన్ కూడా నడుస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. నేటితరం అమ్మాయిలు ఈ యంగ్ హీరోయిన్ ను ఆదర్శంగా తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఆమె చేసిన పనిని ప్రతీఒక్కరు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/ikeerthipandian/status/1257624480181936128