అత్యంత ప్రజాదరణఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఆంధ్రప్రదేశ్బ్రేకింగ్ న్యూస్రాజకీయాలుసంపాదకీయం

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం.. ఎవరికెన్ని సీట్లంటే?

YSRC sweeps panchayat polls in all the four spells

ఏపీలో పంచాయతీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. నాలుగోది.. ఆదివవారం చివరి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైయస్ఆర్సి మద్దతుదారుల భారీ విజయాలను అందుకున్నారు. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.. కార్యకర్తలు ఆదివారం రాత్రి తడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఈ మేరకు సంబరాలు జరుపుకున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 13,000 పంచాయతీలలో అధికార వైసీపీ మద్దతుదారులు 10,000 గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం విశేషం. ఆదివారం జరిగిన చివరిదశ ఎన్నికలతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది.

ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఈ పోరులో రన్నరప్‌గా నిలిచింది. టీడీపీ మద్దతుదారులు కేవలం 2000 గ్రామాలను గెలుచుకోగలిగారు. ఇది మొత్తం పంచాయతీలలో కేవలం 16 శాతం మాత్రమే కావడం గమనార్హం.. భయాల మధ్య.. వైసీపీ, టీడీపీ గొడవల మధ్యసాగిన ఈ ఎన్నికలు దాదాపు అన్ని జిల్లాల్లో శాంతియుతంగా ముగిశాయి.

రాష్ట్ర ఎన్నికల అథారిటీ, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ హింసకు అవకాశం లేకుండా గతంలో కంటే గ్రామ పంచాయతీలు ప్రశాంతంగా ముగిశాయని ప్రకటించారు. బీజేపీ-జనసేన కూటమి మద్దతు అభ్యర్థులు సుమారు 140 గ్రామాలను గెలుచుకోగా, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు దశల్లో దాదాపు 300 గ్రామాల్లో విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సి మద్దతుదారులు నాలుగు విడతల్లో కలిపి దాదాపు 82 శాతం సీట్లతో విజయాలు సాధించారు. మొదటి దశలో 3245 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, రెండవ దశలో 3,225 గ్రామాలు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా, మూడో దశలో 3216 గ్రామాలకు, చివరి దశలో 2235 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి.

ఆసక్తికరంగా, వైఎస్‌ఆర్‌సి మొదటి దశలో 2,616 సర్పంచ్ పోస్టులను, రెండో దశలో 2,654 సీట్లను, మూడో దశలో 2605 సర్పంచ్ పోస్టులను దక్కించుకుంది. లెక్కింపు పూర్తయిన 2,900 గ్రామాలలో దాదాపు 2,300 పంచాయతీలు వైసీపీ సాధించింది. చివరి దశలో వైసీపీకి ఎక్కువగా ఎడ్జ్ లభించింది.
మరో 200 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు అర్థరాత్రి వరకు జరుగింది.వాటి ఫలితాలు తెలియాల్సి ఉంది. .

Back to top button